Sangareddy Teachers Wins Best Teacher Award : ఈ గురువు శిక్షణ ఉపాధికి నిచ్చెనలా నిలుస్తుంది. వృత్తి పరంగా వ్యాయామ ఉపాధ్యాయుడైనా అన్ని అంశాల్లో నిష్నాతుడు. పోలీసు ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన వ్యాయామ ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో కొలువు సాధించారు. ఇప్పుడు ఆయన శిక్షణలో అనేక మంది పోలీసు, రక్షణ శాఖల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక, సామాజిక విషయాల్లో వారికి తోడునీడగా నిలుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.