National Best Doctor Award Winner Arun Kumar : దేవుడిలా వచ్చి ప్రాణం కాపాడిన డాక్టర్‌ను చూసి తాను పెద్దయ్యాకా వైద్యుడిని కావాలనుకున్నాడా యువకుడు. చదువులో మెరిట్ కావడంతో లక్ష్యానికి ఎలాంటి అడ్డంకీ ఏర్పడలేదు. మెరిట్ స్కాలర్షిప్ మీదే చదువుకున్నాడు సూర్యాపేటకు చెందిన అరుణ్‌కుమార్. పాథాలజీలో పీజీ చేస్తూనే గూగుల్ మీటప్స్ ద్వారా వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. విద్యలో ప్రతిభ, వృత్తిలో విశేష సేవలు, పరిశోధనలు చేసి జాతీయ ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అవార్డు అందుకున్నాడు.