Heavy Rains in Srikakulam District : వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా అడపాదడపా పడిన వానలు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పడుతున్నాయి. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరానికి చేరుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.