Cell Phones Recovery in Hyderabad : సెల్ ఫోన్ పోయింది, ఇక మళ్లీ దొరుకుతుందనే ఆశా పోయింది. సరిగ్గా ఈ సమయంలోనే బాధితుల అడియాశకు జీవం పోస్తూ పోలీసులు చరవాణులను ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. పోయిన మీ ఫోన్ దొరికిందని బాధితులకు సమాచారం అందజేస్తున్నారు. ఊహించని విధంగా పొయిన ఫోన్ తిరిగి దొరకడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా గత మూడు నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు 1000 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.