Chadalavada Kranti Save Snakes in Eluru district : పాము పేరు వింటేనే వణికిపోతారు చాలామంది. ఇక ఎదురుపడితేనో భయంతో హడలెత్తిపోతారు. ఎక్కడ కాటేస్తుందో, ప్రాణాలు పోతాయేమో అనే భయంతో కొట్టి చంపేస్తుంటారు. పొలానికి వెళ్లినపుడు ఇలాంటి ఎన్నో సంఘటనలు చూశాడు ఆ యువకుడు. ప్రకృతిలో భాగమైన వాటికీ జీవించే హక్కు ఉంటుంది కదా అని చలించిపోయాడు. ఎంతటి విషసర్పాన్ని అయినా ఇట్టే పట్టేస్తూ పాముల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు.