Snake in Washing Machine: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వాషింగ్ మిషన్లో పాము చూసి షాపు యజమాని ఉలిక్కిపడ్డాడు. ఓ వ్యక్తి మరమ్మతుల చేయమని వాషింగ్ మిషన్ను ఇచ్చివెళ్లాడు. వాషింగ్ మిషన్ను రిపేర్ చేసేందుకు ఓపెన్ చేసిన షాపు యజమానికి ఒక్కసారిగా తాచుపాము దర్శనం ఇచ్చింది. దీంతో వెంటనే అతను స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చాడు. షాపు వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ వాషింగ్ మిషన్ కింద భాగంలో చుట్టుకుని ఉన్న తాచుపామును బయటకు తీసి, ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం ఆ పాముని అటవీ ప్రాంతంలో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ తెలిపాడు.