CNG Filling Stations Shortage : తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించవచ్చనే ఉద్దేశంతో చాలా మంది వాహనదారులు సీఎన్జీ వాహనాల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వాహనాలకు తగ్గట్లుగా సీఎన్జీ బంకులు మాత్రం అందుబాటులో లేవు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎన్జీ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తమ వంతు వచ్చేసరికి నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సీఎన్జీ కొరతపై ప్రత్యేక కథనం.