Food Supply Contract for Anna Canteens to Akshayapatra Foundation: అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ప్రమాణాలతో ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించే అవకాశాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరేకృష్ణ హరేరామ మూమెంట్‌కు అప్పగించారు. వీరు ఇప్పటికే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఆహారం అందిస్తున్నారు. ఇదే అనుభవంతో అన్న క్యాంటీన్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న వంటశాల నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 38 అన్న క్యాంటీన్లకు భోజనం పంపిస్తున్నారు.