AP Ministers Visit to Pavitra Sangamam: కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతుల పునరుద్ధరణకు మంత్రుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని మంత్రులు వెల్లడించారు. 50 ఎకరాల భూమి సేకరించి ఆలయ నిర్మాణం చేస్తామన్నారు. నదికి ఆవల ఉన్న లంక భూములను కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.