Too Much Drainage Problems in Vijayawada : డ్రైనేజీ సమస్య విజయవాడ నగర ప్రజలను పట్టిపీడుస్తోంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ నిర్లక్ష్య పాలనతో చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు, వర్షపు నీరు రెండు ఏకమై రోడ్లపై ప్రవహిస్తోంది. దుర్వాసన వెదజల్లుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా విజయవాడ వాసులు వ్యాధులబారిన పడుతున్నారు.