Rains And Floods Caused Heavy Damage to Farmers: భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీరును మిగిల్చాయి. నాట్లు వేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో నీరు వెళ్లే మార్గం లేక వరినాట్లు పూర్తిగా కుళ్లిపోయాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినా వరదతో తుడిచి పెట్టుకుపోయింది. మళ్లీ నారు దొరికే పరిస్థితి లేక ఖరీఫ్‌పై ఆశలను రైతులు వదిలేసుకుంటున్నారు.