Armoor Mancherial NH63 Highway Issue : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు జాతీయ రహదారిని విస్తరించే ప్రక్రియ కొనసాగుతోంది. 131 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 69 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. భూసేకరణ మొదలుపెట్టిన సర్కార్ పరిహారం ఎంత ఇస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.