Nandivelugu Flyover Incomplete in YSRCP Regime: వైఎస్సార్సీపీ హయాంలో ఎన్నో పెద్ద ప్రాజెక్టులను గాలికి వదిలేయగా చిన్న వాటిని కూడా పూర్తి చేయలేదు. అందుకు నిదర్శనం గుంటూరు- తెనాలి ఫ్లైఓవర్ ప్రాజెక్టు. ఏడేళ్లుగా ప్రజలు ఆ ఫ్లైఓవర్ పూర్తి కోసం నిరీక్షిస్తున్నారు. 2019 నాటికే 25 శాతం పూరైన పనులను వైఎస్సార్సీపీ మధ్యలోనే వదిలేసింది. జగన్ సర్కార్ జాప్యంతో ఇప్పుడు మరింత నిర్మాణ వ్యయం పెరిగేలా కనిపిస్తోంది.