Cs Review Meeting With Collectors : ఐదేళ్లలో 25వేల గ్రామ సమైక్య సంఘాలని కోటీశ్వరులను చేసే దిశగా త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 20 కోట్ల మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని యూరియా, ఇతర ఎరువుల పంపిణీని రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నేటి నుంచి జరగనున్న రైతుసదస్సులు విజయవంతం చేయాలని సూచించారు.