ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సమయంలో కొత్తగా 26 జిల్లాలకు పార్టీ తరపున ప్రస్తుత మంత్రులు ఇన్ ఛార్జ్ లుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్. కొత్తగా ఏర్పాటైన జిల్లాల ఆధారంగా పార్టీ సమస్యలు..బలహీనతలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.