మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!! || Oneindia Telugu

  • 5 years ago
In wildlife animals suffering from water. They do not tolerate the dangers and get into the public. Water ponds in the forest area have fallen. sunny weather is burning in the hot sunny thirst. Forest officials are taking practical steps to fill the water into saucer pitts through tractors.
#seshachalamforest
#nallamalaforest
#penusilaforest
#lankamalla
#rajampeta
#waterscarcity
#animals
#starvation

జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్‌తో అటవీ ప్రాంతంలో జలపాతాలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్‌లలో నీళ్లు సమృద్ధిగా ఉండటం సహజం. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురవలేదు. ప్రకృతి ప్రకోపంతో కరువు తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చే వనరులు వట్టిపోయాయి. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలున్నాయి. ఇందులో నివసిస్తున్న మూగజీవాలకు నీటి సమస్య రావడం అత్యంత దారుణమైన పరిణామంగా జంతు ప్రేమికులు పరిగణిస్తున్నారు.

Recommended