ఫ్యాన్స్‌కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్..!

  • 6 years ago
Pawan kalyan latest movie is Agnyaathavaasi. This film is getting ready for Sankrathi festival. After this movie. In this occassion, once again Pawan Kalyan is singing song for Agyanathavaasi, Which set to release on December 31st.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రం వస్తున్నదంటే అదో మ్యాజిక్‌లానే ఉంటుంది. పంచ్ డైలాగ్స్, సున్నితమైన హాస్యంతోపాటు పవన్ పాడిన పాట అభిమానులకు బోనస్‌గా ఉంటుంది. తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఈ క్రేజీ కాంబినేషన్ ఓ గిప్ట్ ఇచ్చేదుందకు సిద్ధమైంది. ఇంతకీ అదేమిటంటే..
గతంలో అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ చేత త్రివిక్రమ్ పాడించిన కాటమరాయుడా.. కదిరి నరసింహుడా అనే పాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అజ్ఞాతవాసి చిత్రం కోసం మరోసారి పవన్ గొంతు సవరించుకోకున్నారు.
అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మరోసారి పాట పడబోతున్నారు. త్వరలోనే సంగీత దర్శకుడు అనిరుధ్ ఆయన చేత పాట పాడిస్తారు అని చెప్పారు.
అలాగే పవన్ పాడిన పాటను డిసెంబర్ 31వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయాలని నిర్ణయించింది. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ఫ్యాన్స్, సినీ అభిమానులకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అని సుమ పేర్కొన్నారు.

Recommended