• 8 years ago
Jana Sena Party chief Pawan Kalyan finishes his latest movie Agnathavasi movie shoot recently. Now he is concentrated on Jana Sena Party affairs. He started Districts tours for strengthening the party.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీని సమాయత్తం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశాడు. తొలి విడుతగా బుధవారం (డిసెంబర్ 6న) విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మొత్తం మూడు విడుతలుగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. తన పర్యటన నేపథ్యంలో యువతను తట్టి లేపేందుకు ఓ పాటను రిలీజ్ చేశారు.
ప్రజల పక్షాన జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేశంగా గళం విప్పారు. నిరాశ, నిస్పృహలో ఉన్న యువతను ఉత్తేజ పరుచడానికి చలోరే చలోరే.. చల్ అనే పాటను జనసేన పార్టీ విడుదల చేసింది. వింటారా.. వెనకాలే వస్తారా? అంటూ దర్శకుడు త్రివిక్రమ్ మాటలతో ప్రారంభమైన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక పార్టీ పైన దృష్టి సారిస్తున్నారని తెలుస్తుంది. ఓ వైపు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై జనసేన దృష్టి సారించింది.

Recommended