Kirak Party Collections : బడ్జెట్ తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ...!

  • 6 years ago
Nikhil Siddharth is all thrilled with the huge response for Kirrak Party. He threw a party for the film unit on Sunday night. After the party, the actor shared a photo and wrote, "After 3 days of Super Run at the BOX OFFICE... It's time for the Boys to do KIRRAK PARTYYY... This success belongs to every person who took time to watch the film Love u Soo much. "

నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కిరాక్ పార్టీ' చిత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. దీంతో ఈ యంగ్ హీరో ఖాతాలో మరో హిట్ పడ్డట్లయింది. పూర్తిగా కాలేజ్ లైఫ్‌ను ఫోకస్ చేస్తూ తెరకెక్కిన ఈచిత్రం యువతను బాగా ఆకట్టుకుంటోంది. నిఖిల్ గత చిత్రాలతో పోలిస్తే అతడి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
మూవీ క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్ రావడం, సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తొలి వారాంతాం ‘కిరాక్ పార్టీ' చిత్రం రూ. 10.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఊహించిన దానికి కంటే అధిక మొత్తమే అని అంటున్నారు.
తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేసిన ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 10 కోట్లు, శాటిలైట్ రైట్స్, డివీడీ, డిజిటల్ రూపంలో మరో 5 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే సగం వరకు రికవరీ అయినట్లు చర్చించుకుంటున్నారు. నెక్ట్స్ వీక్ సినిమా లాభాల భాట పట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమా 3 రోజుల వసూళ్లతో థ్రిల్ అయిన హీరో నిఖిల్.... చిత్ర యూనిట్ సభ్యులకు ఆదివారం రాత్రి పార్టీ ఇచ్చాడు. పార్టీ అనంతరం కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో పాటు... ‘తొలి 3 రోజులు బాక్సాఫీసు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని, అందుకే తామంతా కలిసి పార్టీ చేసుకున్నామని, ప్రేక్షకులు ఆదరించడం వల్లే సినిమా విజయవంతం అయిందని' ట్వీట్ చేశాడు.
సినిమా హిట్ టాక్‌తో మంచి జోష్ మీద ఉన్న నిఖిల్ సోమవారం హైదరాబాద్‌లోని వివిధ థియేటర్లను సందర్శింస్తూ అభిమానులను ఉత్సహ పరచాలని నిర్ణయించుకున్నాడు.

Recommended