అనుష్క 'భాగమతి' ట్రైలర్ చూసి.. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా ?

  • 6 years ago
After the Bhaagamathie trailer was launched, Prabhas quickly shared it on his Facebook page. He wrote, "True hard work and sheer dedication. Good luck Sweety, Ashok and the entire team of UV Creations for Bhaagamathie."

టాలీవుడ్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క మధ్య మంచి స్నేహ బంధం ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. 2009లో ప్రభాస్‌తో కలిసి తొలిసారిగా 'బిల్లా' చిత్రంలో నటించిన అనుష్క ఆ తర్వాత మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించింది. బాహుబలి సినిమాకు దాదాపు ఐదేళ్లు కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ మధ్య ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు, పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించిన సంగతి సంగతి తెలిసిందే.
అనుష్క నటించిన ‘భాగమతి' మూవీ ట్రైలర్ సోమవారం విడుదలయింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇపుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
‘భాగమతి' ట్రైలర్ చూసిన అనంతరం ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందిస్తూ.... ‘ అనుష్క చాలా కష్టపడుతుంది. ట్రూ హార్డ్ వర్కర్. ఏ పని చేసినా చాలా డెడికేషన్‌‌తో చేస్తుంది. భాగమతి సినిమా స్వీటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా దర్శకుడు అశోక్‌, యువి క్రియేషన్స్ వారికి గుడ్ లక్' అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు.

Recommended