ప్రభాస్‌ దేవుడు అంటూ పొగడ్తలు.. అనుష్క సంతోషం !

  • 6 years ago
Actress Anushka Shetty, Director Ashok Speech at Bhaagamathie Pre Release Event. Bhaagamathie is an upcoming Indian Telugu-Tamil multilingual thriller film written and directed by G. Ashok. It stars Anushka Shetty in the lead role, with Unni Mukundan, Jayaram, and Asha Sarath. S. Thaman composed the music.

అనుష్క టైటిల్ పాత్ర‌లో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో న‌టించిన చిత్రం భాగ‌మ‌తి. అశోక్ ద‌ర్శ‌కుడు. వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లు. ఈ సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.
దర్శకుడు అశోక్ మాట్లాడుతూ..... గెల‌వాల‌నుకున్న‌ప్పుడు క‌ష్టం మొద‌ల‌వుతుంది. ఎలాగైనా గెల‌వాల‌నుకున్న‌ప్పుడు మోసం మొద‌ల‌వుతుంది. ఈ రెండు స‌మాంత‌రంగా న‌డుస్తుంటాయి. త‌ను గెలుస్తూ.. త‌న చుట్టూ ఉన్న వారిని గెలిపిద్దాం అని ఎవ‌రైనా ఆలోచిస్తే .. అతడు మనిషి కాదు, దైవత్వం అతడిలోఎంటరైనట్లు, అలాంటి ఒక దేవుడు ముందు ఈ క‌థ విన్నారు. ఆ దేవుడు ఈ రోజు రాలేక పోయారు. అతడు మరెవరో కాదు ప్ర‌భాస్‌గారు. ఆయ‌న ఈ క‌థ విని, ఇక్క‌డి దాకా న‌డిపించారు.... అని తెలిపారు.
ఈ సినిమా కోసం అనుష్క ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు. విప‌రీత‌మైన డ‌స్ట్‌లో 45 రోజులు ఈ సినిమా చేశారు. మేక్ కొట్టుకుంటున్న షాట్ చాలా బావుందని అంతా అంటున్నారు. ఒక అరగంట ఇలా చేయి పైకి పట్టుకుని నిలబడితే మనకు నొప్పులు వస్తాయి. రెండు రోజులు ఆమె అలా నిలబడితే ఆమెకు ఎంత నొప్పి వచ్చిందో అని నేను చాలా బాధ పడ్డాను. అంత ఒత్తిడి తీసుకుని సినిమా చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు అని.... దర్శకుడు వ్యాఖ్యానించారు.అనుష్క మాట్లాడుతూ - `` 2012లో క‌థ విన‌గానే నాకు నచ్చింది. నా హార్ట్ కు బాగా దగ్గరైన కథ. అయితే డేట్స్ లేక‌పోవ‌డంతో చేయ‌లేన‌ని చెప్పినా కూడా నా కోసం ఇప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేశారు. అలా కాకుండా ఈ సినిమా వేరే వారికి వెళ్లి ఉంటే నేను చాలా బాధ పడేదాన్ని. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అని అన్నారు.

Recommended