'సమ్‌థింగ్.. సమ్‌థింగ్..' అనుష్క కోసమేనా ప్రభాస్..?

  • 6 years ago
Rebel Star Prabhas recently visited Anushka's 'Bhagmati' movie sets, his affair with Anushka Shetty went viral on the Internet but Prabhas refuted the rumours by saying that both are good friends and not going to married.


అనుష్క-ప్రభాస్.. వీరిద్దరి మధ్య ఏదో జరిగిపోతోందన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. అవన్నీ గాసిప్స్ అని వీరిద్దరు కొట్టిపారేస్తున్నా.. 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్..' వ్యహారమేదో నడుస్తోందని అటు ఇండస్ట్రీలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. దానికి తోడు ప్రభాస్ షూటింగ్ సెట్స్‌కు అనుష్క వెళ్లడం.. అనుష్క షూటింగ్ సెట్స్‌కు ప్రభాస్ వెళ్లడం.. వీరిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారన్న ఊహాగానాలకు తావిస్తోంది..
'భాగమతి' సినిమాకు సంబంధించి ఇటీవల యూవీ క్రియేషన్స్ నుంచి ఓ ప్రమోషనల్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాట చిత్రీకరణకు సంబంధించిన షూటింగ్‌ను చూపించారు. అయితే ఇందులో ముఖానికి కర్చీఫ్ కట్టుకుని 'ప్రభాస్' తళుక్కున మెరవడం హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి ప్రభాస్ 'భాగమతి' సెట్స్‌కు వెళ్లాడన్న వార్త ఎక్కడా లీక్ అవలేదు. కానీ ఈ వీడియో చూశాక.. ప్రభాస్ అనుష్క కోసమే అక్కడికి వెళ్లాడా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఓవైపు ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుండటం.. ప్రభాస్‌ను తాను అన్నయ్య అనలేనని అనుష్క చెప్పడం.. ఇవన్నీ వీరిద్దరి మధ్య 'సమ్‌థింగ్..' వ్యహారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే మీడియా ముందు మాత్రం.. తమ మధ్య ఏమి లేదని, జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు వీరిద్దరు.
ప్రభాస్-అనుష్కల్లో ఎవరికో ఒకరికి పెళ్లయితే గానీ ఈ ప్రచారానికి తెరపడేలా లేదు. లేదంటే.. అందరి అంచనాలను నిజం చేస్తూ వీరిద్దరే ఒక్కటైతే గనుక ఇక ఏ గొడవా ఉండదు. చూడాలి మరి.. ఈ రెండింటిలో ఏది జరగబోతుందో?

Recommended