ఆసక్తిరేపుతున్న ప్రభాస్-అనుష్క కొత్త రూమర్స్ !

  • 6 years ago
Baahubali is the highest earners of the year 2017. Soon after the movie was released, rumours of Prabhas and Anushka Shetty's rumours started doing the rounds. Not just that, their fan clubs also started talking about their marriage.

'బాహుబలి' ప్రాజెక్టు భారీ విజయం సాధించడం, వేల కోట్లు వసూలు చేయడంతో ఈ చిత్రంలో జంటగా నటించిన ప్రభాస్, అనుష్క హైలెట్ అయ్యారు. అప్పటి నుండి ఇద్దరి మీద రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి రూమర్స్ అటు ప్రభాస్, ఇటు అనుష్క సన్నిహితులు తోసిపుచ్చారు. అయితే ఈ జంటపై రూమర్స్ మాత్రం ఆగడంలేదు. తాజాగా బాలీవుడ్ మీడియా ఈ జంటపై కొత్త రూమర్స్ ప్రచారంలోకి తెచ్చింది.ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అనుష్క, ప్రభాస్ ప్రేమ వ్యవహారం మరింత ముందుకెళ్లిందని, అనుష్క ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్ అని, ప్రభాస్ అంటే అనుష్కకు చాలా ఇష్టమని, అతడు తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకునే మనస్తత్వం ఆమెది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Recommended