శ్రద్దా కూ తప్పలేదు.. ప్రభాస్ పెళ్లి పై ఏమందో తెలుసా?

  • 6 years ago
Media questioned Heroine Shraddha Kapoor about his marriage in recent press meet, shraddha replied 'i don't know about that.. you just ask him'

బాహుబలి-2 విడుదలకు ముందు 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అన్న ప్రశ్న ఎంతలా పాపులర్ అయిందో.. అంతే స్థాయిలో ప్రభాస్ పెళ్లెప్పుడూ? అన్న ప్రశ్న ఇప్పుడు అంతే పాపులర్ అవుతోంది. ప్రభాస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కో స్టార్స్.. ఇలా మీడియాకు ఎవరికి చిక్కినా సరే.. వాళ్లంతా ఈ ప్రశ్నను ఫేస్ చేయక తప్పని పరిస్థితి. 'సాహో'లో ప్రభాస్ సరసన నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్‌కు కూడా ఇప్పుడిదే ప్రశ్న ఎదురైంది..
మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా.. ఓ జర్నలిస్ట్ 'ప్రభాస్ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా?..' అని హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ను ప్రశ్నించారు. నవ్వుతూ బదులిచ్చిన శ్రద్దా కపూర్.. 'నాకు తెలియదు.. ఈ ప్రశ్న ఏదో ప్రభాస్‌నే అడగండి' అని చెప్పేసింది.
ప్రభాస్ గురించి ప్రస్తావించడంతో.. 'ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి వ్యక్తి కూడా' అని కితాబిచ్చింది శ్రద్దా. ఇక సాహో సినిమా గురించి ఇప్పుడే తానేమి చెప్పలేనని.. ఆర్నెళ్ల తర్వాత మీరే చూస్తారని చెప్పింది.
ప్రస్తుతం తాను 'స్త్రీ' చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటున్నట్లు శ్రద్దా తెలిపారు. చందేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని చెప్పారు. తన కెరీర్‌లో ఇదే తొలి హారర్ సినిమా అని చెప్పుకొచ్చారు.
ఇక ప్రభాస్ పెళ్లి విషయానికొస్తే.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా చేతులెత్తిసినట్లే కనిపిస్తోంది. ప్రభాస్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక పెళ్లి గురించి తనకే తెలియాలి అన్నట్లుగా కృష్ణంరాజు కామెంట్ చేశారు. సో.. ప్రభాస్ పెళ్లెప్పుడూ? అంటూ ఎంతమందిని ప్రశ్నించినా దానికి సమాధానం రాబట్టడం ఇక కష్టమే. నేరుగా ప్రభాస్ చెబితే తప్ప దీనిపై క్లారిటీ రావడం కష్టం.

Recommended