Son Continue Spiritual Journey on Scooter : వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల పోషణే బరువనుకునే ప్రస్తుత సమాజంలో ఓ కుమారుడు కన్నతల్లితో కలసి మాతృసంకల్ప యాత్ర చేపట్టాడు. ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్న తల్లి కోరికతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తల్లితో కలసి భారతదేశ యాత్రకు శ్రీకారం చుట్టాడు. స్కూటర్‌పై దేశంలోని అనేక పురాతన ఆలయాలను దర్శిస్తూ నెల్లూరు చేరుకున్నారు.