Congress Party Candle Rally Protest Against Pahalgam Terror Attack : ఉగ్రవాదం నిర్మూలనలో కేంద్రానికి సంపూర్ణ మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకుని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పి పీవోకేను భారత్‌లో కలపాలని ఆయన సూచించారు. ఇవాళ సాయంత్రం పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.