Sc Classification Implemented in Telangana : 30 ఏళ్ల పోరాటానికి తెరపడి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో తక్షణం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు, జీవోలు జారీ చేసినట్లు తెలిపారు. తొలికాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ అందించింది.