Pawan Kalyan Wife Anna Lezhneva Visits Tirumala: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్రస్థాయి సంప్రదాయాలను పాటిస్తూ అన్నాలెజినోవా వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారి హరింద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్సు గుండా ఆలయంలోకి వెళ్లిన అన్నాలెజినోవా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.