TDP Leaders Issue in Pulivendula : వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల టీడీపీలో మరోసారి వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇంఛార్జ్ మంత్రి సవిత ఎదురుగానే తెలుగుదేశం సీనియర్ నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. ఎమ్మెల్యే రాంగోపాల్‌రెడ్డి, బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.