తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి వివిధ రకాల పూలతో అభిషేకం చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేస్తారు.