Film Chamber Reacts on Actors in Betting Apps Cases : బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా స్పందించింది. సమాజంలో చెడును ప్రోత్సహిస్తున్న బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేస్తున్న నటీనటులపై కఠిన చర్యలు తప్పవని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరించింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్న వారిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాయనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు.