Araku Coffee in Parliament Members : చాలామందికి వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే ఇష్టం. దాదాపు కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో. మరోవైపు రాష్ట్రంలోని అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచిపోతుంది. ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో దీనిని గురించి చాలాసార్లు ప్రస్తావించారు.