Nelapattu Bird Sanctuary In Tirupathi District: పక్షుల పండగతో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం సందర్శకులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవురోజు కావడంతో పాఠశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు విచ్చేసి చెరువుల్లో సేదతీరుతున్న విహంగాలను వీక్షించారు. ఐదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న వేడుక కావడంతో రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చారు.