• last year
Doddi Komaraiah Kuruma Bhavan Inaugurate : కాంగ్రెస్​ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలు పేదలకే అందుతున్నాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. అమ్మలా ఉండే తెలంగాణ తల్లినే తెచ్చుకున్నామని అన్నారు.. ఆ విగ్రహం మన అమ్మకు, అక్కకు ప్రతిరూపమని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా కులగణన చేపడుతున్నామని వివరించారు. 98 శాతం కులగణన జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్​లోని కోకాపేట్​లో కురుమ భవన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కురుమల నిజాయితీని, గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. కురుమలు అత్యంత నమ్మకస్తులని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని, ఊళ్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని చెబుతుంటానని తెలిపారు. పార్లమెంటులో కూడ కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended