TTD GOVERNING BODY KEY DECISIONS: తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ధర్మకర్తల మండలి నిర్ణయాలు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించి ప్రభ్వుత శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.