Cm Revanth Reddy On Family Digital Card : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్స్ వేదికగా కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సీఎం ప్రయోగాత్మక పథకం కింద డిజిటల్ కార్డుల సమాచారం సేకరణ చేపట్టామని తెలిపారు.