Polavaram Project DPR: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డీపీఆర్ ఆమోదం దిశగా అడుగులు పడుతున్నాయి. 30 వేల కోట్ల రూపాయలతో సిద్ధమైన పోలవరం డీపీఆర్‌ను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. కేబినెట్ ఆమోదం లభించి, నిధులు విడుదలైతే ప్రాజెక్టు పనులు ఊపందుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.