Skill Calculation Survey in Mangalagiri : దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సెప్టెంబరు 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. ఈ సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్లపాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.