RP Sisodia Inquiry Into Govt Land Grabs in Visakha: విశాఖ జిల్లాలో గత ఐదేళ్లలో జరిగిన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం మీద కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ముఖ్యంగా నగరంలోని, జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ అవకతవకలను సీరియస్గా తీసుకొంది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియాతో పూర్తి విచారణ కొనసాగిస్తోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్లో ఆయన పరిశీలన చేపట్టారు.