Road Problems in Adilabad : వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని 11 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారుకు అప్పగించడంతో, ఒకవైపు రోడ్డు పూర్తి చేశారు. మరోవైపు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.