BJP MLA Alleti Maheshwar Reddy Speech in Assembly : ధరణి పోర్టల్ అంశంపై మరోసారి శాసనసభలో రచ్చ రాజుకుంది. ఈ మేరకు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధరణి పోర్టల్ పేరుతో లాభం పొందిన గులాబీ నేతలెవ్వరో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ధరణిపై సమీక్ష జరిపిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.