Anna Canteens Reopen From August 15th: రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న పునఃప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీ హయంలో రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్లను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు