కొత్త బీర్ బ్రాండ్లపై ఎక్సైజ్ శాఖ విచారణ
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 12 బాటిళ్ల బీరు కేసు ప్రాథమిక సగటు ధర రూ.291 ఉండగా ఓ కంపెనీకి ఏకంగా రూ.907కు టీడీబీసీఎల్ గుట్టుగా అనుమతి ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే ఏకంగా రెండు రెట్లు అధిక ధర ఖరారు చేయడంపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది. కొత్త బీరు బ్రాండ్ల అనుమతులపై ఇవాళ, రేపో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.