ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆర్థికంగా పాకిస్థాన్ క్రికెట్ మరింత బలంగా మారాలంటే కొత్త ఆస్తులు కూడగట్టుకోవాలని అభిప్రాయపడ్డాడు. అప్పుడు పీఎస్ఎల్‌ను కాదని ఐపీఎల్ ఎవరు ఆడతారో చూద్దామని రమీజ్ రాజా వ్యాఖ్యానించారు.రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఖండించాడు. అలాగే రమీజ్ రాజాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.