Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Shocking Incident - చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప రూ.80,000 అప్పు మునికన్నప్ప వద్ద తీసుకున్నాడు. అప్పు చెల్లించలేకపోయిన తిమ్మరాయప్ప ఊరు విడిచి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష బెంగళూరులో కూలి పని చేసి కుమారుడిని పోషిస్తూ శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటోంది. సోమవారం శిరీష తన కుమారుడి పాఠశాల టీసీ తీసుకునేందుకు నారాయణపురం పాఠశాలకు వెళ్లినప్పుడు, మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి ఆమెను పట్టుకుని అప్పు డబ్బు చెల్లించాలని వాగ్వాదం చేశారు. ఆ సమయంలో శిరీషను చెట్టుకు కట్టి దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిరీషను విడిపించి రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

In Narayanapuram village, Chittoor district, Shireesha was attacked by her husband’s creditor and his family over an unpaid loan of Rs. 80,000. Her husband fled the village, leaving her to raise their son alone. When she went to collect her son’s school Transfer Certificate, the creditor’s family confronted and assaulted her. Police intervened after locals alerted them, and a case has been registered.

#Kuppam
#Narayanapuram
#ChittoorNews
#LoanDispute
#DebtHarassment
#WomenSafety
#CMChandrababu
#TDP

Also Read

చంద్రబాబు.. ఇది గుర్తు పెట్టుకో: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/telangana/revanth-reddy-slams-chandrababu-naidu-in-press-meet-after-opposition-mps-discuss-banakachar-scandal-440261.html?ref=DMDesc

రైతుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/revanth-reddy-prioritizes-farmers-interests-in-godavari-banakacharla-project-talks-with-opposition-440251.html?ref=DMDesc

బనకచర్ల ప్రాజెక్టుపై ముదురుతున్న వివాదం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ :: https://telugu.oneindia.com/news/telangana/minister-uttam-letter-to-central-government-on-banakacharla-project-439773.html?ref=DMDesc



~HT.286~

Category

🗞
News

Recommended