నాడు YSR... నేడు జగన్... ముఖ్య‌మంత్రిగా రూపాయి జీతం!! | Ycp | Y.s.Jagan | AP CM 2019
  • 5 years ago
Not only NTR in AP YSR also taken one rupee for his services as minister in Anjaiah cabinet . Before that YSR called as One rupee doctor in Pulivendula. Now, jagan following his father tradition.AP CM YS Jagan decided to take 1 rupee salary per month due to the Deficit budget and financial condition of the State. While everyone is eager to know about the 1st signature as a CM of AP, the YCP sources say that Jagan's will make a crucial statement on the implementation of Navaratnalu scheme.
#apgovt
#newcm
#jagan
#ysr
#ntr
#doctor
#minister
#chandra babu

రూపాయి జీతం. ఇప్పటి వ‌ర‌కు ఎన్టీఆర్ ఒక్క‌రే ముఖ్య‌మంత్రిగా రూపాయి జీతం తీసుకున్నార‌నే విష‌యం ప్రచారంలో ఉంది. ఏపీ కొత్త ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ సైతం అదే త‌ర‌హాలో ఎన్టీఆర్‌ను అనుస‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, ఇక్క‌డ జ‌గ‌న్ అనుస‌రిస్తుంది ఎన్టీఆర్‌ను కాదు..త‌న తండ్రి వైయ‌స్సార్‌ను. వైయ‌స్సార్‌కు రాజ‌కీయాల్లోకి రాకుముందే రూపాయి డాక్ట‌ర్‌గా పులివెందుల‌-జ‌మ్మ‌లమ‌డుగులో పేరుంది. ఇదే స‌మ‌యంలో వైయ‌స్సార్‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. అదే ఇప్పుడు జ‌గ‌న్‌కు స్పూర్తి. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే..

ఎమ్మెల్యేలుగా ఎన్నికై చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర రెడ్డి ఇద్ద‌రు నాటి ముఖ్య‌మంత్రి అంజ‌య్య కేబినెట్‌లో మంత్రుల‌య్యారు. అప్పుడు చంద్ర‌బాబు సినిమా ఆటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్నారు. 1980లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి అదే కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖా స‌హాయ మంత్రి అయ్యారు. ఆ రోజుల్లో రాష్ట్రం క‌రువుతో అల్లాడుతున్న స‌మ‌యం. ముఖ్యంగా రాయ‌ల‌సీమ ప్రాంతం దుర్భిక్ష్యంతో అల్లాడింది. దీంతో..వారికి అండ‌గా నిల‌వాల‌నే సంక‌ల్పంతో కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ఆ ప్రాంతానికి చెందిన వాడిగా అక్క‌డి ప‌రిస్థితుల‌ను క‌ళ్లారా చూసి..ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రిగా త‌న‌కు వ‌చ్చే జీత‌-భ‌త్యాల‌ను వ‌దులుకున్నారు. కేవ‌లం మంత్రిగా రూపాయి మాత్ర‌మే వేత‌నం తీసుకున్నారు. అదే కేబినెట్‌లో అదే ప్రాంతానికి చెందిన మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు మాత్రం ఇలా చేయ‌లేక పోయారు. దీంతో..నాటి సీఎం అంజ‌య్య త‌న మంత్రి వైయ‌స్‌ను అభినందించారు.

Recommended