IPL 2018: Mumbai indians vs Royal Challengers Bangalore Match Complete Review
  • 6 years ago
Virat Kohli waged a lonely war as Royal Challengers Bangalore handed Mumbai Indians their first win in the 2018 Indian Premier League (IPL) at the Wankhede Stadium on Tuesday (April 17). Rohit Sharma's 94, the highest individual score this season, and Evin Lewis' 65 was enough for the hosts to post an imposing 213/6 in their 20 overs.

ఐపీఎల్ 2018 సీజన్‌లోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్‌కి మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక అయింది. రోహిత్ జట్టు కోహ్లీ సేనపై భారీ ఆధిక్యంతో గెలుపొంది. లీగ్ మొత్తానికి ఆలస్యంగా శుభారంభం పలికింది. ఏ మాత్రం ఆశలు లేకపోయినా మ్యాచ్ ఆఖర్లో కోహ్లీ ఇంకా బౌండరీలపైనే గురి పెట్టి 92 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లు విజృంభించడంతో కోహ్లీ సేన పరుగులు తీసేందుకు తటాపటాయించింది. ఈ క్రమంలో అడపాదడపా కెప్టెన్ పరుగులు తీసేందుకు ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయాడు. దీంతో బెంగుళూరు జట్టు ఇంకా 46 పరుగులు రావాల్సి ఉండగానే ఓవర్లు అయిపోవడంతో మ్యాచ్ ముగించేసింది.
దాదాపు ఐపీఎల్ కెరీర్ లోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడానికి ఇంత కష్టపడి ఉండడే. 40 బంతులు ఆడిన కోహ్లీ 50 స్కోరు చేయగలిగాడు. అదే పిచ్‌పై ముందు బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తే.. బెంగుళూరు జట్టుకు అలా చేయడం తీవ్రతరంగా అనిపిస్తోంది.
భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు అతి కష్టంపై పరుగులు చేస్తోంది. కోహ్లీ మినహాయించి ఎవ్వరూ కనీసం 20కి మించిన స్కోరు కూడా చేయలేకపోయారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్, బౌలింగ్ లోనూ ఇరగదీస్తోంది. ఆ జట్టు బౌలింగ్ లో కోహ్లీ కూడా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ముంబై జట్టు ఆటగాళ్లైన కృనాల్ పాండ్యా 3, మిచెల్ మెక్లెన్‌గన్ 2వికెట్లను తీశారు.
Recommended