BR Naidu Fires on Bhumana : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గోశాలలో ఆవులు మరణించాయంటూ వైఎస్సార్సీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే నానితో కలిసి ఆయన గోశాలను పరిశీలించారు. అక్కడి ఇంఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాసులతో సమావేశమై గోశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.