Purandeswari on Waqf Bill : రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నేతలు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్ రామ్ జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని పేర్కొన్నారు.