Son in Law Who Gave Supari To Kill His Aunt And Uncle in Visakha : అత్తమామలను హత్య చేసేందుకు సొంత అల్లుడే సుపారి ఇచ్చిన ఘటన విశాఖపట్నం గాజువాకలో వెలుగుచూసింది. ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాల మేరకు, కరణం శ్రీనివాస్, మౌనికలు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే కొంత కాలంగా ఇరువురి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో మౌనిక తల్లిదండ్రులైన సూర్యనారాయణ, సరస్వతిల వద్దకు వెళ్లిపోయింది.